ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'నగదు బదిలీ వద్దు... ఉచిత విద్యుతే ముద్దు' - లావేరులో రైతుల ధర్నా వార్తలు

వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్ మీటర్లు పెడుతూ ఇచ్చిన జీవో 22ను తక్షణమే రద్దు చేయాలని శ్రీకాకుళం జిల్లా లావేరులో రైతు సంఘాల నాయకులు ధర్నా చేశారు

farmer unions leaders protest at laveru
లావేరులో రైతు సంఘాల నాయకుల ధర్నా

By

Published : Sep 14, 2020, 8:50 PM IST


శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం లావేరు మండల కేంద్రంలో ఉన్న విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం ఉచిత విద్యుత్ పథకం స్థానంలో నగదు బదిలీ పథకం అమలు చేయడం కోసం 22 జీవోను ప్రభుత్వం తీసుకు వచ్చిందని జిల్లా రైతు సంఘం కార్యదర్శి మోహన్ రావు అన్నారు. తక్షణమే ఈ జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగిస్తే రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం డిస్కంలకు నేరుగా నగదు చెల్లించాలని కోరారు. 'నగదు బదిలీ వద్దు ఉచితం ముద్దంటూ' నినాదాలు చేశారు. 9 గంటలు నాణ్యమైన విద్యుత్​ను రైతులకు అందించాలని వారంతా డిమాండ్ చేశారు. తక్షణమే అధికారులు స్పందించి పగటిపూట విద్యుత్ సరఫరాను అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు, రైతు సంఘం నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఇదీ చూడండి.ఏపీలోని వాయు కాలుష్య నగారాలివే.. చెప్పిన కేంద్రం


ABOUT THE AUTHOR

...view details