ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీకాకుళంలో.. పొక్లెయిన్‌ కిందకు వెళ్లి ఓ రైతు ఆందోళన - వంగరలో రైతుల ఆందోళన

శ్రీకాకుళంలో ఆక్రమణల తొలగింపులో ఉద్రిక్తత నెలకొంది. ఎవరూ లేని సమయంలో పశువులశాలలు కూల్చివేస్తుండగా... పొక్లెయిన్‌ కిందకు వెళ్లి ఓ రైతు ఆందోళన తెలిపాడు. పశువులశాలను తొలగిస్తే చచ్చిపోతానని నిరసన వ్యక్తపరిచాడు.

farmer protest for land issue in srikakulam vangara
farmer protest for land issue in srikakulam vangara

By

Published : Feb 5, 2020, 8:21 AM IST

పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు శ్రీకాకుళం జిల్లా వంగర మండలంలోని కొట్టీశ గ్రామంలో ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూముల స్వాధీనానికి అధికారులు చేపట్టిన చర్యలు ఉద్రిక్త పరిస్థితికి దారితీసింది. 2001 నుంచి తమ అధీనంలో ఉన్న భూములు, పశువులశాలలను ఎటువంటి సమాచారం లేకుండా తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు. పనులు ఆపివేయాలని లేకపోతే తాను చచ్చిపోతానంటూ పొక్లెయిన్‌ కిందకు వెళ్లి ఓ రైతు నిరసనకు దిగడంతో సమస్య తీవ్రమైంది.

తమ భూములు లాక్కోవడం దారుణమని, గ్రామంలో వేరేచోట ప్రభుత్వ భూమి అందుబాటులో ఉన్నప్పటికీ రాజకీయపరమైన ఒత్తిళ్లతో అధికారులు ఇలాంటి చర్యలు చేపడుతున్నారని వారు ఆరోపించారు. ఈ విషయమై తహసీల్దార్‌ ఇసాక్‌ను వివరణ కోరగా ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకునేందుకు సమాచారం ఇవ్వాలన్న నిబంధన ఏమీ లేదన్నారు. బాధితులకు జీవనోపాధికి సంబంధించి స్థలం కేటాయించేందుకు చర్యలు చేపడతామన్నారు. ప్రభుత్వం తరఫున వారికి న్యాయం చేస్తామని తాత్కాలికంగా పనులు నిలిపివేస్తున్నట్టు చెప్పారు. అనంతరం రైతులను పోలీసులతో తీవ్రంగా బెదిరించి ఆపై వారు లేని సమయంలో పశువులశాలలను కూల్చివేశారు.

ఇవీ చదవండి:పోలవరం 58 శాతం పనులయ్యాయ్​.. సుప్రీంకు స్టేటస్ రిపోర్ట్

ABOUT THE AUTHOR

...view details