దివంగత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం సూక్ష్మ చిత్రాన్ని... శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట వాసి వీరమల్లు శివ నాగ నరసింహాచారి రూపొందించారు. అబ్దుల్ కలాంపై అభిమానంతో.. పెన్సిల్ మొనపై ఆయన సూక్ష్మ చిత్రాన్ని తయారుచేశారు. ఈ కళాఖండం తయారీకి 4 గంటల సమయం పట్టిందని నరసింహ తెలిపారు. నరసింహాచారి ఇప్పటికే పలు దేశ నాయకులు, దేవతా చిత్రాలను తయారుచేసి అవార్డులు పొందారు.
అబ్దుల్ కలాంపై అభిమానం... పెన్సిల్ మొనపై సూక్ష్మ కళాఖండం - శ్రీకాకుళం జిల్లా నేటి వార్తలు
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటకు చెందిన ఓ వ్యక్తి... దివంగత రాష్ట్రపతి అబ్దుల్ కలాంపై తన అభిమానాన్ని చాటుకున్నారు. ఆయన జయంతి సందర్భంగా... పెన్సిల్ మొనపై సూక్ష్మ కళతో చిత్రాన్ని రూపొందించి ఔరా అనిపించుకున్నారు.
అబ్దుల్ కలాంపై అభిమానం... పెన్సిల్ మొనపై సూక్ష్మ కళాఖండం