శ్రీకాకుళం జిల్లా పొందూరు తహసీల్దార్ కార్యాలయంలో జరుగుతున్న రైతు భరోసా గ్రీవెన్స్‌లో ఓ రైతు హల్చల్ చేశాడు. దల్లలవలసకు చెందిన వెంకటరమణ అనే రైతు తనకు రైతు భరోసా నగదు ఇంకా అందలేదంటూ వ్యవసాయ అధికారిపై తిరగబడ్డాడు. డబ్బు కోసం ఎన్ని రోజులు తిప్పించుకుంటారని వారిపై అసహనం వ్యక్తం చేశాడు. తెలంగాణలో తహసీల్దార్‌పై పెట్రోల్ పోసి తగలబెట్టినట్లు మిమ్మల్నీ చేయాలని బెదిరించాడు. దీనిపై ఆందోళన చెందిన అధికారులు జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వారి సూచన మేరకు ఏవో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రైతు బెదిరించాడని వ్యవసాయ అధికారి ఫిర్యాదు - farmer demaded to revenue officer in srikakulam district thalildar
తెలంగాణాలోని తహసీల్దార్‌పై జరిగిన దాడిని ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు త్వరితగతిన చేయించుకునేందుకు కొందరు ఉపయోగించుకుంటున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఓ అన్నదాత తనకు రైతు భరోసా డబ్బు ఇంకా అందలేదంటూ ఏవోను బెదిరించాడు.
![రైతు బెదిరించాడని వ్యవసాయ అధికారి ఫిర్యాదు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5072270-7-5072270-1573808967408.jpg)
తహసీల్ధార్‌ను బెదిరించిన రైతు...