శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం పెద్ద భీంపురం గిరిజన ప్రాంతానికి చెందిన రైతు గొడ్డ సింహాచలం (35) విద్యుదాఘాతానికి గురై మరణించాడు. ఓ పొలంలో వేరుశనగ పంటను జంతువులు నాశనం చేయకుండా రక్షణగా పెట్టిన కరెంటు తీగలు కాలికి తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. బాధితుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
వరి పంటకు నీరు పెట్టేందుకు రైతు వెళ్లిన సమయంలో.. విద్యుత్ తీగలు తగిలి ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని టెక్కలి సీఐ నీలయ్య, ఎస్సైలు కామేశ్వరరావు, గోపాలరావు పరిశీలించారు. పొలం చుట్టూ ప్రమాదకరంగా విద్యుత్తు తీగలు పెట్టిన మాధవరావుపై కేసు నమోదు చేశారు.