ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భారీ వర్షానికి నీట మునిగిన పంట - పాలకొండ మండలంలో భారీగా వర్షాలు

కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు పాలకొండ మండలంలోని పలు గ్రామాల్లో పంట పొలాలు నీట మునిగాయి. పెట్టుబడులు సైతం నష్టపోయాయంటూ రైతులు ఆవేదన చెందుతున్నారు.

farm field gets filled with water in palakonda mandal due to heavy rains
జంపరకోట గడ్డలకు గండి... నీట మునిగిన పొలాలు

By

Published : Jul 17, 2020, 12:00 AM IST

ఇటీవల కురుస్తున్న వర్షాలకు శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలం బీపీ రాజుపేట, సంపత్​ రాపల్లి, గోపాలపురం గ్రామాల్లో పొలాలు ముంపునకు గురయ్యాయి. జంపరకోట గెడ్డలకు గండి పడి పొలాల్లోకి నీరు ప్రవేశించింది.

నారు మడులు సిద్ధం చేసుకున్న రైతులు తమ పొలాలు నీట మునిగాయని ఆందోళన చెందారు. పెట్టుబడులు సైతం నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి గెడ్డలకు గండి పడకుండా చర్యలు తీసుకోవాలని వేడుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details