ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీకాకుళం జిల్లాకు తప్పిన ఫొని తుపాను ముప్పు - ఫొని

శ్రీకాకుళం జిల్లాకు పెనుముప్పు తప్పినట్లేనని జిల్లా పాలనాధికారి జె.నివాస్‌ స్పష్టం చేశారు. ఒడిశాలో భారీ వర్షాలు కురిస్తే వరదలు వచ్చే అవకాశముందని పేర్కొన్నారు. ఫొని తుపాను ప్రభావంపై జె.నివాస్‌ 'ఈటీవి భారత్​'తో ప్రత్యేకంగా మాట్లాడారు.

సిక్కోలు జిల్లాకు తప్పిన ఫొని ముప్పు

By

Published : May 3, 2019, 8:27 AM IST

Updated : May 3, 2019, 8:33 AM IST

శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురంలో ఇంతవరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టాలు జరగలేదని జిల్లా పాలనాధికారి జె.నివాస్‌ తెలిపారు. విద్యుత్ స్తంభాలు కొన్ని వాలిపోయినట్లు సమాచారం వచ్చింది.. వెంటనే పునరుద్ధరిస్తామని చెప్పారు. రహదారులపై రాకపోకలకు అంతరాయం లేకుండా చేస్తున్నామన్న కలెక్టర్‌... తుపాను అనంతరం వరదలు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు.

ముఖ్యంగా బహుదా, వంశధార నదుల్లో వరదలు వస్తాయని కలెక్టర్‌ వివరించారు. ప్రజలు నదులు దాటే ప్రయత్నం చేయొద్దని విజ్ఞప్తి చేశారు. ఇసుక తవ్వకాలు... ఇతర పనులకు నదుల్లోకి వెళ్లొద్దని కోరారు. నదీ తీరంలోని ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సెల్ కంపెనీల అనుసంధానం చేశామన్న పాలనాధికారి... ఒక సంస్థ టవర్ దెబ్బతిన్నా మరో సంస్థ టవర్ ద్వారా సిగ్నల్‌కు అవకాశం కల్పించామని చెప్పారు. కమ్యూనికేషన్ వ్యవస్థకు ఎలాంటి నష్టం కలగలేదని తెలిపారు.

సిక్కోలు జిల్లాకు తప్పిన ఫొని ముప్పు
Last Updated : May 3, 2019, 8:33 AM IST

ABOUT THE AUTHOR

...view details