ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కాలు లేదు... వికలాంగ పింఛను ఇప్పించండి సారూ' - శ్రీకాకుళం జిల్లా హిరమండలంలోని అక్కరాపల్లి పంచాయితీ చవితిసీది

సెంటు భూమి లేనోడికి 12 ఎకరాలు భూమి ఉందని...సర్కారు నుంచి పింఛన్ అందలేదు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుదామంటే...ఆయనకు కాలు లేదు.  ఏంచేయాలో తెలియక ఆత్మ విశ్వాసాన్ని ఆయుధంగా మలిచి  భార్య సాయంతో మండల కార్యాలయాల చుట్టూ ప్రదిక్షిణలు చేస్తున్నాడు శ్రీకాకుళం జిల్లా వాసి యువరాజ్.

పింఛన్ కోసం ఎదురుచూస్తున్న యువరాజ్

By

Published : Sep 22, 2019, 4:53 AM IST

Updated : Sep 22, 2019, 6:39 AM IST

కాలు లేదయ్యా... వికలాంగ పింఛను ఇప్పించడయ్యా

శ్రీకాకుళం జిల్లా హిరమండలంలోని అక్కరాపల్లి పంచాయితీ చవితిసీది గ్రామానికి చెందిన... బూర్లె యువరాజ్, ఇందు‌‌ భార్యాభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు. విధికి ఏం అనిపించిందో ఏమో...ఈ కుటుంబాన్ని వంచించింది. యువరాజ్​కు బోన్ క్యాన్సర్‌ వచ్చింది. శస్త్రచికిత్స చేసి వైద్యులు ఎడమకాలును తొలగించారు. ఎంపీడీవో కార్యాలయంలో వైఎస్సార్‌ భరోసా పింఛను కోసం 4 నెలల క్రితం దరఖాస్తు చేశాడు. అతని పేరు మీద 12 ఎకరాల భూమి వెబ్‌సైట్‌లో ఉండటం వల్ల.... పింఛను మంజూరుకు అర్హత లేదని అధికారులు తేల్చి చెప్పారు. అండగా ఉండాల్సిన అధికారులు ఆదుకోనంటున్నారు. పింఛన్ కోసం... ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ భార్య సాయంతో ప్రదక్షిణలు చేస్తూ.... దిక్కుతోచని స్థితిలో బిక్కుబిక్కుమని కార్యాలయం దగ్గరే ఉండిపోతున్నారు. వీరిని ఈటీవీ భారత్ ప్రతినిధి పలకరించేసరికి... కళ్లంట నీళ్లు తిప్పుతూ అసలు విషయం తెలిపారు. తన పేరు మీదున్న భూమిని తొలగించి పింఛను వచ్చేలా చూసి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతున్నారు.

Last Updated : Sep 22, 2019, 6:39 AM IST

ABOUT THE AUTHOR

...view details