ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

12 ఏళ్ల తర్వాత.. ఇంటికి చేరిన కన్నప్రేమ - srikakulam bhavani news

12 ఏళ్ల క్రితం విడిపోయిన రక్తబంధం ఒక్కటైతే.. అమ్మతో చిన్నప్పుడు చెప్పిన మాటలు.. నాన్నతో ఆడుకున్న ఆటలు.. అన్నయ్యతో పడిన గొడవలు మళ్లీ దగ్గరైతే.. ఇప్పుడు అదే ఆనందం పొందుతోందీ భవానీ. చిన్నప్పుడు అదృశ్యమై ఇప్పుడు స్వగ్రామానికి చేరుకుంది.

12 ఏళ్ల తర్వాత.. ఇంటికి చేరిన కన్నప్రేమ
12 ఏళ్ల తర్వాత.. ఇంటికి చేరిన కన్నప్రేమ

By

Published : Dec 9, 2019, 12:08 PM IST

12 ఏళ్ల తర్వాత.. ఇంటికి చేరిన కన్నప్రేమ

ఎప్పుడో.. చిన్నప్పుడు ఇంటికి దూరమైన భవాని రక్త సంబంధీకుల చెంతకు చేరింది. తన స్వగ్రామానికి చేరుకున్న ఆమెకు ఎదో తెలియని అనుభూతి. మనసులో ఏదో ఆనందం. ఇన్నేళ్ల తన అనుభవం.. తన జీవిత విధానం కుటుంబ సభ్యులకు చెప్పుకుంది. ఇలా మళ్లీ కన్నప్రేమను కలవడం అస్సలు నమ్మలేకపోతోంది. 12 ఏళ్ల క్రితం హైదరాబాద్​లో తప్పిపోయిన భవాని.. జయమ్మ అనే మహిళ దగ్గర పెరిగింది. విజయవాడకు చెందిన వంశీ అనే రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్​ ద్వారా ఫేస్​బుక్​లో భవాని తన అన్నను గుర్తించింది. పెంచిన తల్లితో పాటు కన్నతల్లి కావాలని చెప్పిన భవాని.. ప్రస్తుతం తన తల్లిదండ్రుల చెంతకు వచ్చింది.

సంబంధిత కథనాలు :

ABOUT THE AUTHOR

...view details