ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బంటుపల్లి ఘర్షణలో గాయపడ్డ భాజపా వర్గీయులను పరామర్శించిన మాదవ్​ - బంటుపల్లిలో తీవ్ర ఉద్రిక్తత

శ్రీకాకుళం జిల్లా రణస్థలంలోని బంటుపల్లి గ్రామంలో వైకాపా దాడిలో గాయపడిన భాజపా కార్యకర్తలను ఎమ్మెల్సీ మాధవ్ పరామర్శించారు. రాష్ట్రంలో ఎక్కడా ప్రశాంత వాతావరణం కనిపించడం లేదన్న ఆయన.. బాధితులను పోలీసులు అన్యాయంగా అరెస్టు చేస్తున్నారని ధ్వజమెత్తారు.

బంటుపల్లిలో ఉద్రిక్తత

By

Published : Nov 5, 2019, 6:06 PM IST

బంటుపల్లిలో తీవ్ర ఉద్రిక్తత ....
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం బంటుపల్లి గ్రామంలో ఆదివారం జరిగిన భాజపా వైకాపా వర్గీయుల మధ్య ఘర్షణ నేడు తారాస్థాయికి చేరుకుంది. గాయపడిన భాజపా వర్గీయులను పోలీసులు కొట్టి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లటంతో ఒక్కసారిగా గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వైకాపా నాయకులు తమ ఇళ్ళను ధ్వంసం చేసి.. ఇంట్లో ఉన్న సామగ్రిని బీరువాలో ఉన్న డబ్బులను తీసుకెళ్లారని బాధితులు ఆరోపిస్తున్నారు. వైకాపా నాయకులు అమానుషంగా దాడులు చేస్తున్నారని వాపోయారు. కేవలం వైకాపా జెండాలు కట్టలేదని ఈ దాడులు చేస్తున్నారని బాధితులు గగ్గోలు పెడుతున్నారు. వైకాపా దాడిలో గాయపడిన బాధితులను భాజపా ఎమ్మెల్సీ మాధవ్ పరామర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం పోలీసులతో అరాచకాలు చేయిస్తోందని ఎక్కడ చూసినా గొడవలు తప్ప ప్రశాంత వాతావరణం లేదని మండిపడ్డారు. బాధితులకు భాజపా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details