మాజీఎంపీ బొడ్డేపల్లి రాజగోపాలరావు విగ్రహ ఆవిష్కరణ - speaker tammineni sitaram latest news update
మాజీఎంపీ బొడ్డేపల్లి రాజగోపాలరావు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. జిల్లా కిమ్స్ ఆసుపత్రి రహదారిలో ఇంటాక్ ఆధ్వర్యంలో మంత్రి ధర్మాన కృష్ణదాస్‌తో కలిసి సభాపతి తమ్మినేని సీతారాం విగ్రహ ఆవిష్కరణ చేశారు. పేద రైతులకు భూములను ఉచితంగా పంపిణీ చేసిన దానగుణం కలవాడు రాజగోపాలరావు అని పలువురు కొనియాడారు.
1952 నుంచి 1984 వరకు 6 సార్లు శ్రీకాకుళం పార్లమెంటు సభ్యులుగా ఎన్నికైన మహానేత రాజగోపాలరావు అని సభాపతి తమ్మినేని సీతారాం కొనియాడారు. బొడ్డేపల్లి రాజగోపాలరావు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. జిల్లా కిమ్స్ ఆసుపత్రి రహదారిలో ఇంటాక్ ఆధ్వర్యంలో మంత్రి ధర్మాన కృష్ణదాస్‌తో కలిసి తమ్మినేని సీతారాం విగ్రహావిష్కరణ చేశారు. నీతి నిజాయితీ పరమావధిగా తన రాజకీయ ప్రస్థానంలో జిల్లాను ముందుండి నడిపించిన వ్యక్తి.. బొడ్డేపల్లి రాజగోపాలరావుని, జిల్లా అభివృద్ధి కోసం అనునిత్యం తపనపడిన నేత అని తమ్మినేని సీతారాం పేర్కొన్నారు.
ఇవీ చూడండి...
ఆమదాలవలసలో వైఎస్సార్ విగ్రహావిష్కరణ పనులు పరిశీలించిన సభాపతి
TAGGED:
విగ్రహావిష్కరణ తాజా వార్తలు