ముఖ్యమంత్రి ఏడాదిపాలనపై మాజీ ఎమ్మెల్యే బొడ్డెపల్లి సత్యవతి శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలోని తన నివాసంతో ఓ లేఖ విడుదల చేశారు. మీ పాలన, మా సూచన అంటూ తొమ్మిది అంశాలతో సీఎం జగన్కు లేఖ రాశారు. ఈ సంవత్సర కాలంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పరిపాలనలో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. అస్థిర ప్రభుత్వ పరిపాలనలో అభివృద్ధి కుంటుపడింది విమర్శించారు.
వైకాపా ఏడాది పాలనపై తొమ్మిది అంశాలతో లేఖ.. - latest news of ex mla sathyavahi letter
వైకాపా ఏడాది పాలనపై శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మాజీ ఎమ్మెల్యే, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు బొడ్డేపల్లి సత్యవతి ఓ లేఖను విడుదల చేశారు. వైకాపా పాలనలో 'మీ పాలన -మా సూచన' అంటూ తొమ్మిది అంశాలతో సీఎంకు లేఖను రాశారు.
ex mla boddepalli sathyavarhi wrote a letter against ycp govt
అంశాలు: 1.ఏక వ్యక్తి నియంతృత్వ తరహా. 2.రాజ్యాంగ వ్యతిరేక ,చట్ట వ్యతిరేక పాలన. 3.'సంఖ్యా బలం'తో వ్యవస్థను కూలదోశారు. 4. ప్రత్యేకహోదా 'బేరం' కాదు-హక్కు. 5. రాజధాని మార్పు-రాష్ట్ర అభివృద్ధికి చేటు. 6. ఎస్సీ, ఎస్టీల నిధులు దారి మళ్లింపు. 7. కేటాయింపులు ఎక్కువ వినియోగం తక్కువ. 8. ప్రజా వ్యతిరేక పాలన. 9. 90 శాతం పైగా ఫెయిల్యూర్. ఈ అంశాలతో కూడిన లేఖను సత్యవతి విడుదల చేశారు.
ఇదీ చూడండి