ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బాబూరావు కుటుంబానికీ రూ.50 లక్షలు ఇవ్వాలి: అచ్చెన్న - atchannaidu letter to cm jagan news

శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరుకు చెందిన వీర జవాను బాబూరావు కుటుంబానికి 50 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేయాలని మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్​కు ఆయన లేఖ రాశారు.

atchannaidu
atchannaidu

By

Published : Nov 11, 2020, 6:18 PM IST

వీర జవాన్ల మరణాల్లోనూ కులాన్ని బట్టి సాయం అందించటం వైకాపా ప్రభుత్వానికే చెల్లిందని మాజీ మంత్రి అచ్చెన్నాయుడు దుయ్యబట్టారు. బుధవారం ముఖ్యమంత్రి జగన్​కు అచ్చెన్న లేఖ రాశారు. చిత్తూరు జిల్లాకు చెందిన వీర జవాను ప్రవీణ్ కుమార్ రెడ్డి కుటుంబానికి 50 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేసిన ప్రభుత్వం... శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరుకు చెందిన వీర జవాను బాబూరావు కుటుంబానికి ఎందుకు సాయం చేయలేదని లేఖలో ప్రశ్నించారు.

బాబూరావు విధి నిర్వహణలో వీరమరణం పొందినా... అతని కుటుంబానికి ముఖ్యమంత్రి కనీసం సంతాప సందేశం కూడా పంపకపోవటాన్ని అచ్చెన్నాయుడు తప్పుబట్టారు. మరణాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం కులాలతో చూడటం పతనమే తప్ప మరొకటి కాదన్నారు. బాబూరావు కుటుంబానికి కూడా 50 లక్షల రూపాయల సాయం అందించాలని లేఖలో డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details