శ్రీకాకుళం జిల్లా టెక్కలి పట్టణ పరిధిలోని గోపినాథపురం నాసిరకం కందిపప్పు పంపిణీపై... ఈనాడు- ఈటీవీభారత్ కథనానికి రెవెన్యూ అధికారులు స్పందించారు. కరోనా వైరస్ కారణంగా లాక్డౌన్ కాలంలో ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసిన కందిపప్పు... పుచ్చిపోయి, పురుగులు పట్టి ఉన్న విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో టెక్కలి తహసీల్దార్ శ్రీరాములు స్పందించారు. నాసిరకం కందిపప్పును రేషన్ డీలర్, గ్రామ వాలంటీర్.. ఇంటింటికీ వెళ్లి సేకరించారు. వాటి స్థానంలో నాణ్యమైన కందిపప్పు ప్యాకెట్లు పంపిణీ చేశారు.
ఈటీవీభారత్ ఎఫెక్ట్: నాసిరకం పప్పు వెనక్కి..! - etv bharat effect in srikakulam news
టెక్కలి పట్టణ పరిధిలోని గోపీనాథపురంలో ప్రభుత్వం ప్రజలకు ఉచితంగా సరకులు అందిస్తోంది. ఇక్కడ నాసిరకం కందిపప్పును పంచిపెట్టారు. దీనిపై ఈనాడు, ఈటీవీ భారత్ కథనం ప్రచురించింది. అధికారులు స్పందించి... నాసిరకం పప్పును వెనక్కి తీసుకుని నాణ్యమైన పప్పును పంపిణీ చేశారు.
etv bharat effect