YCP Leaders Angry: శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల వైకాపా ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్‌పై నియోజకవర్గ పరిధిలోని సొంత పార్టీ నాయకులే భగ్గుమంటున్నారు. నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాల ముఖ్య నాయకులు లావేరులో సమావేశమై ఎమ్మెల్యే తీరుపై మండిపడ్డారు. పార్టీలో ఒకే వర్గానికి పెద్దపీట వేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ ఎమ్మెల్యే మాకొద్దంటూ..ముఖ్య నాయకులు అందరూ ముక్తకంఠంతో చెప్పారు. వచ్చే ఎన్నికల్లో గొర్లె కిరణ్ కుమార్‌కు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి కోసమే పనిచేస్తామన్న వైకాపా నేతలు.. ఎమ్మెల్యేపై అధిష్టానానికి ఫిర్యాదు చేశామన్నారు. దీంతో పాటు మండలాల్లో ఎన్నికైన ఎంపీపీలు పనితీరు అధ్వానంగా ఉందని ధ్వజమెత్తారు.
YCP Leaders Angry: "ఈ ఎమ్మెల్యే మాకొద్దు...."- ఎచ్చెర్ల వైకాపా నాయకులు - ఎచ్చెర్ల వైకాపా నాయకుల ఆగ్రహం
YCP Leaders Angry: శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల వైకాపా ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్‌పై నియోజకవర్గ పరిధిలోని సొంత పార్టీ నాయకులే భగ్గుమంటున్నారు. పార్టీలో ఒకే వర్గానికి పెద్దపీట వేస్తున్నారని ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో గొర్లె కిరణ్ కుమార్‌కు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే సహించేది లేదని స్పష్టం చేశారు.
ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్ తీరుపై మండిపడిన వైకాపా నాయకులు