Etcherla YCP leaders: ఎక్కడైనా ఎమ్మెల్యే వస్తున్నారంటే సభలు పెట్టి మైకులతో ఎమ్మెల్యే జై అంటూ నినాదాలు చేస్తారు. ఇక కార్యకర్తలైతే ఎన్నికైన తరువాత తమ సమస్యలు తీరుస్తాడనే నమ్మకంతో ఆయన వెంట తిరుగుతారు. ఆ పార్టీ జెండాలు మోస్తారు.. అయితే పల్లక్కి ఎక్కిన రాజు బోయలను మరిచినట్లుగా... ఆ ఎమ్మెల్యే తన కోసం కష్టపడిన నాయకులు, కార్యకర్తలను మరిచాడు. పైగా పదవులను సైతం తన అనుచర వర్గం వారికి బంధుమిత్రులకు ఇచ్చుకుంటూపోతున్నాడు. ఈ కోవలోనే అధికార వైసీపీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ఎమ్మెల్యేపై తిరుగుబాటు చేశారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ పై స్థానిక వైసీపీ నేతలు, కార్యకర్తలు తిరుగుబాటు బావుట ఎగరవేశారు. మాకు ఈ ఎమ్మెల్యే వద్దు అంటూ నినాదాలు చేస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఎమ్మెల్యేగా గొర్లె కిరణ్ కుమార్ కొనసాగితే నియోజకవర్గంలో పార్టీ మనుగడ కష్టంగా మారుతుందని హెచ్చరించారు.
MLA Gorle Kiran Kumar: మాకొద్దు ఈ ఎమ్మెల్యే.. అధికార పాార్టీలో నేతల తిరుగుబావుట..! - అవినీతి ఆరోపణలైప ఎమ్మెల్యే
MLA Gorle Kiran Kumar: శ్రీకాకుళం ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్‌కు వ్యతిరేకంగా వైసీపీ నేతలు అసంతృప్తి గళమెత్తారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకం నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం స్థానిక నేతలు, కార్యకర్తలు కిరణ్ కుమార్ తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే గెలుపునకు కష్టపడి పని చేసిన వారికి విలువ ఇవ్వకుండా... కొంతమంది నేతలకే వత్తాసు పలుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ:ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ కు వ్యతిరేకంగా వైసీపీ ద్వితీయ శ్రేణి నేతలు లావేరు మండలం పెద్దలింగాలవలస గ్రామంలో సమావేశం ఏర్పాటు చేసి ఆయనకు వ్యతిరేకంగా నిరసన గళమెత్తారు. దిగువ స్థాయి నాయకులు కార్యకర్తలు లావేరు మండల వెంకటాపురం నుంచి ర్యాలీ నిర్వహించారు. అనంతరం జగన్ ముద్దు - కిరణ్ వద్దు అంటూ నినాదాలు చేస్తూ భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు నేతలు పాల్గొన్నారు. ఎమ్మెల్యే కిరణ్ కుమార్ గెలుపుకు కష్టపడి పని చేసిన వారికి విలువ ఇవ్వకుండా కొంతమంది నేతలకే వత్తాసు పలుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రూ.లక్షల్లో పెట్టుబడి పెట్టి పనులు చేసినప్పటికీ ఇంత వరకు బిల్లు రాలేదని వాపోయారు. ఎమ్మెల్యే కుటుంబీకులకే పదవులు పనులు అధికారులు కల్పిస్తున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే కిరణ్ కుమార్ కు టికెట్ ఇస్తే పనిచేసే ప్రసక్తే లేదని వైసీపీ నేతలు కార్యకర్తలు ముక్తకంఠంతో తెలిపారు.
గతంలో సైతం:ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ పలు సందర్భాల్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో నిరసన సెగ తగిలింది. ఎచ్చెర్ల నియోజకవర్గంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో స్థానికులు, వైసీపీ కార్యకర్తల నుంచి ప్రశ్నల వర్షం కురిసింది. ఆ సందర్భంలో వారిని వారించే ప్రయత్నం చేయడంతో అప్పట్లో ఎమ్మెల్యే తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. రహదారి, తాగునీరు, ఉద్యోగ... సమస్యలపై ప్రశ్నించిన వారిపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేసిన వీడియోలు అప్పట్లో వైరల్గా మారాయి.