శ్రీకాకుళం జిల్లాలో ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్(ఏపీటీఎఫ్) ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో పేదలకు నిత్యాసర వస్తువులు పంపిణీ చేశారు. సంఘం జిల్లా అధ్యక్షుడు మజ్జి మదన్మోహన్రావు ఆధ్వర్యంలో సంతకవిటి, వంగరరేగిడి, రాజాం మండలాల్లోని అన్నార్తులకు ఈ సహాయం అందించారు. లాక్డౌన్ కారణంగా ఆకలితో అలమటిస్తున్న పేదలను గుర్తించి జిల్లా అంతటా ఈ సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని ఆయన తెలిపారు.
పేదలకు నిత్యావసర వస్తువుల పంపిణీ
రాష్ట్రవ్యాప్తంగా లాక్డౌన్ కట్టుదిట్టంగా అమలవుతోంది. లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన పేదలు, వలస కూలీలు, కార్మికులను ఆదుకునేందుకు పలువురు ముందుకు వస్తున్నారు. తమకు తోచినంత తోడ్పాటును అందిస్తూ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు.
essential needs distribution in srikakulam district