శ్రీకాకుళం జిల్లాలో ఆర్టీసీ అద్దె బస్సుల సిబ్బందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఏపీఎస్ఆర్టీసీ యూనియన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి సనపల నరసింహులు సిబ్బందికి సరుకులు పంచిపెట్టారు. కరోనా మహమ్మారి వలన కార్మికుల జీవితాలు, ఆకలితో అలమటించే పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆపదలో భరోసా ఇచ్చేందుకు కార్మిక సంఘాలు ఎప్పుడూ ముందు ఉంటాయని తెలియజేశారు.
ఆర్టీసీ అద్దె బస్సుల సిబ్బందికి నిత్యావసరాల పంపిణీ - శ్రీకాకుళం తాజా కరోనా వార్తలు
శ్రీకాకుళం జిల్లాలో ఆర్టీసీ అద్దె బస్సుల్లో పని చేస్తున్న సిబ్బందికి ఏపీఎస్ఆర్టీసీ యూనియన్ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు పంచిపెట్టారు.
శ్రీకాకుళంలో సిబ్బందికి నిత్యావసర వస్తువులు పంచుతున్నఆర్టీసీ యూనియన్