ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భూముల రీసర్వే పత్రాల పంపిణీ ఎందుకు ఆలస్యం అవుతోంది.. - Resurvey in Nellore District

Errors in land survey: భూముల రీసర్వే పూర్తైన గ్రామాల్లో పత్రాల పంపిణీని బుధవారం నుంచి... శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో సీఎం జగన్‌ ప్రారంభించారు. ఐతే రైతులకు నేరుగా ఇచ్చే పత్రాల పంపిణీ ప్రారంభంకాలేదు. మొదటి విడతలో భాగంగా 8 లక్షల మందికి హక్కు పత్రాల పంపిణీ జరిగేలా జిల్లాలకు వివరాలు వెళ్లాయి. కానీ గత నెల తొలివారంలోనే పత్రాలు అందించాలని అనుకున్నా.... తప్పులు దొర్లడంతో పంపిణీ వాయిదా వేశారు. నాటి నుంచి తప్పులు సరిదిద్దే పనులు కొనసాగుతున్నాయి..

భూముల రీసర్వే
భూముల రీసర్వే

By

Published : Nov 24, 2022, 3:02 PM IST

Errors in land survey: భూముల రీసర్వే పూర్తైన గ్రామాల్లో పత్రాల పంపిణీని బుధవారం నుంచి శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో సీఎం జగన్‌ ప్రారంభించారు. ఐతే రైతులకు నేరుగా ఇచ్చే పత్రాల పంపిణీ ప్రారంభంకాలేదు. మొదటి విడతలో భాగంగా 8 లక్షల మందికి హక్కు పత్రాల పంపిణీ జరిగేలా జిల్లాలకు వివరాలు వెళ్లాయి. అధికారులు పంపిణీ చేస్తున్న పత్రాల్లో ఇంకా లోపాలు ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాలకు చేరిన వాటిలో తప్పులు లేనివాటిని ముందుగా పంపిణీ చేయాలని.. తప్పులు ఉన్నవాటిని సరిదిద్దిన తర్వాతే పంపిణీ చేయాలని ప్రభుత్వం నుంచి జిల్లాలకు ఆదేశాలు వెళ్లాయి. దీంతో జాయింట్‌ కలెక్టర్ల ఆధ్వర్యంలో భూ హక్కు పత్రాలను పరిశీలిస్తున్నారు.

నెల్లూరు జిల్లాలో రీసర్వే పూర్తైన ఓ గ్రామంలో 40 శాతం, మరో గ్రామంలో 60 శాతం వరకు భూహక్కు పత్రాల్లో తప్పులు దొర్లినట్లు తెలుస్తోంది. పేర్లలో తప్పులతో పాటు హక్కుదారుడి ఫోటోలు కూడా మారినట్లు తెలుస్తోంది. కొన్ని పత్రాల్లో భూమి విస్తీర్ణంలోనూ తేడాలు వచ్చాయి. ఆధార్‌ నంబర్లూ తప్పుగా పడ్డాయి. మరో రెండు, మూడు జిల్లాల్లో ఇలాంటి తప్పులే జరిగినట్లు సమాచారం. గత నెల తొలివారంలోనే పత్రాలు అందించాలనుుకున్నా.. తప్పులు దొర్లడంతో పంపిణీ వాయిదా వేశారు. అప్పటి నుంచి ఇటీవల వరకూ తప్పులు సరిదిద్దే పనులు కొనసాగుతున్నాయి.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details