పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని పాలకొండ శాసన సభ్యురాలు కళావతి అన్నారు. ఇవాళ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలంలోని తన స్వగ్రామం వండవలో గ్రామస్థులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా... ప్రపంచం కాలుష్య కోరల్లో చిక్కుకుందని... మన పర్యావరణాన్ని మనమే కాపాడుకోవాలని కళావతి పేర్కొన్నారు. ప్రస్తుతం వాతావరణంలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోయాయని చెప్పారు. ఒకప్పుడు పేదవాడి ఊటీగా పేరొందిన శ్రీకాకుళం జిల్లాలో కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదవతున్నాయన్నారు.
'పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత'
ప్రపంచం కాలుష్య కోరల్లో చిక్కుకుందని... మన పర్యావరణాన్ని మనమే కాపాడుకోవాలని పాలకొండ ఎమ్మెల్యే కళావతి పేర్కొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తన స్వగ్రామంలో గ్రామస్థులతో కలిసి ఆమె మొక్కలు నాటారు.
ప్రతి ఒక్కరు ఒక మొక్కను నాటి దాని సంరక్షణ చూడాలని కోరారు. వృక్ష సంపద ఎంత పెరిగితే మనం అంత పరిరక్షించ బడతామని పేర్కొన్నారు. అనంతరం తమ గ్రామస్థులతో 'పర్యావరణ పరిరక్షణ ప్రతిజ్ఞ' చేయించి మెుక్కలు నాటించారు. సీతంపేట ఏజన్సీ ప్రాంతంలో దట్టమైన అడవులు పాడవుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. ఏజెన్సీలో ప్రతీ ఒక్కరూ మెుక్కలు నాటాలని.... అటవీశాఖ అధికారులతో చర్చించి మెుక్కలు తెచ్చేందుకు చర్యలు చేపడతామన్నారు. కొవిడ్-19 నిబంధనల ప్రకారం భౌతికదూరం పాటిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.