ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భావనపాడు సముద్రతీరంలో మర పడవ బోల్తా..మత్స్యకారులు సురక్షితం - భావనపాడులో మత్య్సకారులు వార్తలు

శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం భావనపాడు సముద్రతీరంలో అలల తాకిడికి మర పడవ బోల్తా పడింది. అందరూ క్షేమంగా ఇంటికి రాగా.. మత్య్సకారులు పట్టిన చేపలన్నీ సముద్రం పాలయ్యాయి.

engine boat  rolled  due to waves at bhavanapadu
భావనపాడులో అలల తాకిడికి మర ఇంజన్ పడవ బోల్తా

By

Published : Sep 18, 2020, 7:32 PM IST


శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం భావనపాడు సముద్రతీరంలో మర ఇంజిన్ పడవ బోల్తా పడింది. పడవలో మొత్తం ఆరుగురు మత్స్యకారులు శుక్రవారం వేకువజామున చేపల వేటకు వెళ్లారు. తిరిగి వస్తున్న సమయంలో తీరానికి 200 మీటర్ల దూరంలో అలల తాకిడికి పడవ బోల్తా పడింది. మత్స్యకారులు ఆందోళన చెందారు. వేటాడి తెచ్చుకున్న చేపలు నీటిలో కొట్టుకుపోగా.. వలలు కొట్టుకుపోకుండా రక్షణ చర్యలు చేపట్టారు.

గ్రామంలోని మత్స్యకారులకు సమాచారం అందించడంతో హుటాహుటిన చేరుకుని అతికష్టం మీద పడవను ఒడ్డుకు చేర్చారు. మత్స్యసంపద పోవడంతో పాటు పడవ దెబ్బతిని వేలాది రూపాయల నష్టం వాటిల్లిందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి.'మారుతున్న ప‌రిస్థితుల‌కు అనుగుణంగా రైతులకు సూచన‌లు ఇవ్వండి'

ABOUT THE AUTHOR

...view details