శ్రీకాకుళం జిల్లా వీరఘట్టంలో 220 లీటర్ల నాటుసారా తరలిస్తున్న వ్యక్తులను గుర్తించి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు పట్టుకున్నారు. నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.
కడప జిల్లా రైల్వే కోడూరు మండలంలో నాటుసారా స్థావరాలపై స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు చేసి 4 లీటర్ల నాటుసారా, 12 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు.
కడప జిల్లా బద్వేల్ మండలం మల్లం పేట గ్రామ వ్యవసాయ పొలాల్లో బద్వేలు గ్రామీణ ఎస్ఐ కృష్ణయ్య... సిబ్బందితో కలిసి దాడులు చేశారు. నాటు సారా కాస్తున్న జోగిరెడ్డి పల్లికి చెందిన ప్రసాద్, వెంకటేశ్, సాంబశివారెడ్డిలను అరెస్టు చేశారు. 7 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నారు. 100 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేశారు.
అక్రమంగా మద్యం తరలిస్తున్న ఆరుగురు వ్యక్తులను గుంటూరు పోలీసులు అరెస్టు చేశారు. 872 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. సంగడిగుంట మొదటి లైన్లో రెండు ఆటోల్లో మద్యాన్ని గుర్తించారు. తెలంగాణ నుంచి మద్యం తీసుకువచ్చి ఇక్కడ విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
పశ్చిమ గోదావరి జిల్లా తణుకు వద్ద జాతీయ రహదారిపై గంజాయి రవాణాను పోలీసులు అడ్డుకున్నారు. ద్విచక్రవాహనంపై తీసుకెళ్తున్న 2,980 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని యువకుడిని అరెస్టు చేశారు.