ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీకాకుళం కలెక్టరేట్ వద్ద ఉద్యోగులు ధర్నా - శ్రీకాకుళంలో పంచాయతీరాజ్‌ ఉద్యోగులు నిరసన వార్తలు

శ్రీకాకుళం కలెక్టరేట్ వద్ద ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. రోడ్డు నిర్మాణంలో ఇంజినీర్లపై అక్రమ కేసులను పెడుతున్నారని మండిపడ్డారు.

Employees  protest at Srikakulam Collector
శ్రీకాకుళం కలెక్టర్ వద్ద ఉద్యోగులు ధర్నా

By

Published : Oct 19, 2020, 8:09 PM IST

పంచాయతీరాజ్‌ ఇంజినీర్లపై కక్ష సాధింపులకు వ్యతిరేకంగా.. శ్రీకాకుళం కలెక్టరేట్‌ వద్ద ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. గత ప్రభుత్వంలో చేపట్టిన సీసీ రహదారులకు.. అవార్డులు వచ్చాయని ఉద్యోగులు గుర్తు చేశారు. అయితే రోడ్డు నిర్మాణంలో ఇంజినీర్లపై అక్రమ కేసులను పెడుతోందని పీఆర్‌ జేఏసీ ఛైర్మన్ రామకృష్ణ అన్నారు.

మెమో 1202ని వెంటనే రద్దు చేయాలని వారంతా డిమాండ్‌ చేశారు. జిల్లా యంత్రాంగం వేధింపులు ఆపాలని పీఆర్​జేఏసీ తరుఫున విజ్ఞప్తి చేశారు. రేపు ఉద్యోగులంతా నిరవధిక సహాయ నిరాకరణ చేపడతామని పీఆర్‌ జేఏసీ జిల్లా సెక్రటరీ జనరల్ మహంతి తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details