ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీకాకుళంలో ఏనుగుల సంచారం... ఆందోళనలో స్థానికులు - శ్రీకాకుళంలో ఏనుగుల సంచారం వార్తలు

శ్రీకాకుళం జిల్లాలో ఏనుగుల సంచారం స్థానికుల్లో ఆందోళన కలిగిస్తుంది. అధికారులు ఏనుగుల గుంపును అడవిలోకి తరలించాలని కోరుతున్నారు.

Elephants wandering and spoiling the farms in Srikakulam district
శ్రీకాకుళంలో ఏనుగుల సంచారం

By

Published : Jan 10, 2020, 11:41 PM IST

శ్రీకాకుళంలో ఏనుగుల సంచారం

శ్రీకాకుళం జిల్లాలో ఏనుగుల సంచారం స్థానికుల్లో ఆందోళన కలిగిస్తుంది. విజయనగరం జిల్లా నుంచి శ్రీకాకుళం జిల్లాలోకి వచ్చిన ఆరు ఏనుగుల గుంపు... రెండు రోజులు కిందట వీరఘట్టం మండలంలోని కడకెల్ల, చిట్టిపూడివలస గ్రామాల్లో పంటలు నాశనం చేశాయి. ఏనుగులు అక్కడినుంచి పాలకొండ మండలం సీతంపేట గ్రామానికి చేరాయి...వీటిని గమనించిన గ్రామస్తులు బాణాసంచా కాల్చడంతో అవి బడ్డుమాసింగి గ్రామానికి చేరుకున్నాయి. ఈ గ్రామానికి సమీపంలో చెరుకు తోటలు ఉండడంతో ఏనుగులు అక్కడే తిష్ట వేశాయి. గ్రామ సమీపంలోనే గుంపు సంచరిస్తుండడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఏనుగుల గుంపును అడవిలోకి తరలించాలని కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details