శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం నీలకంఠ పురం గ్రామానికి సమీపంలోని కి ఏనుగుల గుంపు వచ్చింది. సమీప కొండ ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా ఉన్న ఏనుగుల గుంపు శనివారం నీలకంఠాపురం గ్రామానికి సమీపంలో రావడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. గ్రామ సమీపాన వచ్చిన ఏనుగుల గుంపు వరి, కంది, చీపురు పంటలను నాశనం చేస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మరింత పంట నష్టం జరగకుండా అటవీశాఖ అధికారులు చర్యలు చేపట్టాలని స్థానిక రైతులు కోరుతున్నారు.
నీలకంఠపురం సమీపంలో ఏనుగుల గుంపు.. ఆందోళనలో ప్రజలు - నీలకంఠ పురం గ్రామానికి సమీపంలో ఏనుగుల గుంపు
శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం నీలకంఠ పురం గ్రామానికి సమీపంలోకి ఏనుగుల గుంపు రావడంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. గ్రామ సమీపాన వచ్చిన ఏనుగుల గుంపు వరి, కంది, చీపురు పంటలను నాశనం చేస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఏనుగుల గుంపు