రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల జేఏసీ పిలుపు మేరకు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట సబ్ డివిజన్ కార్యాలయం ఎదుట విద్యుత్ ఉద్యోగులు నిరసన చేపట్టారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో గత నెల 19 నుంచి వివిధ దశల్లో నిరసన తెలుపుతున్నారు. మంగళవారం పలు సబ్స్టేషన్లకు చెందిన ఉద్యోగులతో పాటు ఏడీ రామినాయుడు, ఏఈలు చంద్రమౌళి, కోటేశ్వరరావు, విద్యుత్ ఉద్యోగుల సంఘం డివిజన్ అధ్యక్షుడు లోకేశ్వరరావు తదితరులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.
నరసన్నపేటలో విద్యుత్ ఉద్యోగుల నిరసన - నరసన్నపేటలో విద్యుత్ ఉద్యోగుల నిరసన
తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట సబ్ డివిజన్ కార్యాలయం ఎదుట విద్యుత్ ఉద్యోగులు, అధికారులు నిరసన చేపట్టారు.
నరసన్నపేటలో విద్యుత్ ఉద్యోగుల నిరసన