ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తాళాల తంటా.. - elections duty visit in Srikakulam district latest news

రాష్ట్ర ఎన్నికల పరిశీలకుడు స్వరూప్ సోమవారం నరసన్నపేటలో కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలిస్తుండగా చేదు అనుభవం ఎదురైంది. కళాశాలకు చెందిన ఎన్‌సీసీ విద్యార్థి ప్రధాన గేటుకు తాళం వేసి వెళ్లిపోయాడు. దీంతో చాలాసేపు అంతా లోపలే ఉండిపోయారు.

DOORLOCK
DOORLOCK

By

Published : Apr 6, 2021, 9:53 AM IST

రాష్ట్ర ఎన్నికల పరిశీలకుడు స్వరూప్‌కు నరసన్నపేటలో చేదు అనుభవం ఎదురైంది. ఆయన సోమవారం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్‌ కేంద్రాన్ని పరిశీలించేందుకు వచ్చారు. లోపలికి వెళ్లి తనిఖీ చేస్తుండగా కళాశాలకు చెందిన ఎన్‌సీసీ విద్యార్థి ప్రధాన గేటుకు తాళం వేసి వెళ్లిపోయాడు. దీంతో చాలాసేపు అంతా లోపలే ఉండిపోయారు. బయట ఉన్న సిబ్బంది స్పందించి బండరాయితో తాళాలను విరగ్గొట్టడంతో బయటకు వచ్చారు.

ABOUT THE AUTHOR

...view details