శ్రీకాకుళం జిల్లా పాలకొండ నగర పంచాయతీలో ప్రధాన పార్టీలతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. తెదేపా తరఫున ఛైర్మన్ అభ్యర్థిగా బరిలో ఉన్న లక్ష్మి.. రెండో వార్డులో ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఇంద్రనగర్ కాలనీలో వైకాపా అభ్యర్థుల తరఫున ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి, డీసీసీబీ మాజీ అధ్యక్షులు పాలవలస విక్రాంత్ ప్రచారం చేశారు. భాజపా తరఫున ఆ పార్టీ నాయకులు పలు వార్డుల్లో ప్రచారంలో పాల్గొన్నారు. స్వతంత్రులు సైతం తన మద్దతుదారులతో కలిసి ఇంటింటి ప్రచారం చేపట్టారు.
పాలకొండలో జోరందుకున్న ప్రచారం - srikakulam district updates
శ్రీకాకుళం జిల్లా పాలకొండ నగర పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థుల ప్రచారం జోరందుకుంది. పార్టీల అభ్యర్థులకు దీటుగా ఇండిపెండెంట్ అభ్యర్థులు ఇంటింటి ప్రచారం చేపట్టారు.
పాలకొండలో జోరందుకున్న ప్రచారం