శ్రీకాకుళంలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో నిర్వహించిన చదరంగం పోటీలు... నువ్వానేనా అన్నట్టుగా సాగాయి. ఈ పోటీల్లో 25 మంది బాలురు, నలుగురు బాలికలు పాల్గొన్నారు. బాలుర విభాగంలో శ్రీదీక్షిత్, మణికంఠ, బాలికల విభాగంలో అశ్విని, స్వాతి ప్రథమ, ద్వితీయ స్థానాలను కైవసం చేసుకున్నారు.
హోరాహోరీగా 'ఈనాడు' ఆటల పోటీలు - శ్రీకాకుళంలో చెస్ వార్తలు
శ్రీకాకుళం జిల్లాలో 'ఈనాడు' స్పోర్ట్స్ లీగ్-2019 పోటీలు హోరాహోరీగా జరిగాయి. ఆర్ట్స్ కళాశాలలో చదరంగం, కొండములగాంలో బ్యాడ్మింటన్ పోటీలు జరిగాయి.
బ్యాడ్మింటన్ ,చదరంగం ఆటలు ఆడుతున్న క్రీడాకారులు
రణస్థలం మండలం కొండములగాం స్టేడియంలో నిర్వహించిన బ్యాడ్మింటన్ పోటీలు ఉత్సాహంగా సాగాయి. ఈ పోటీల్లో సింగిల్స్‌కు 45 మంది హాజరవ్వగా.. డబుల్స్‌లో 19 జట్లు పాల్గొన్నారు. సింగిల్‌లో శ్రీకాకుళం ఎన్ఆర్ఐ కళాశాలకు చెందిన తరుణ్ విజేతగా నిలిచాడు. డబుల్స్‌లో కొత్తూరు శ్రీవెంకటసాయి జూనియర్ కళాశాల విద్యార్థులు శరత్‌సాయి, జోగేంద్రలు గెలుపొందారు.
ఇదీచూడండి.'క్రీడలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుంది'