శ్రీకాకుళం జిల్లాలో 'ఈనాడు' స్పోర్ట్స్ లీగ్-2019 క్రికెట్ పోటీలు రసవత్తరంగా జరిగాయి. ఆర్ట్స్ కళాశాల, ఎచ్చెర్ల శివానీ ఇంజినీరింగ్ కళాశాల మైదానాల్లో జూనియర్ విభాగంలో 37జట్లు పాల్గొన్నాయి. సీనియర్ విభాగంలో 48 జట్లు అడాయి. సీనియర్ విభాగంలో పలాస శ్రీసత్య సాయి డిగ్రీ కళాశాల జట్టుపై, రాజాం జీఎంఆర్ ఐటీ కళాశాల జట్టు నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
శ్రీకాకుళంలో ముగిసిన 'ఈనాడు' స్పోర్ట్స్ లీగ్-2019 క్రికెట్ పోటీలు - ఈనాడు స్పోర్ట్స్ లీగ్-2019 క్రికెట్ పోటీలు
శ్రీకాకుళం జిల్లాలో 'ఈనాడు' స్పోర్ట్స్ లీగ్-2019 క్రికెట్ పోటీలు ముగిశాయి. గెలిచిన జట్లకు బీ.ఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ సీతారామారావు బహుమతులు అందజేశారు.
గెలుపొందిన జట్టుకు బహుమతి అందిస్తున్న బీ.ఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ సీతారామారావు
జూనియర్ విభాగంలో రణస్థలం శాంతినికేతన్ జూనియర్ కళాశాల జట్టుపై... నరసన్నపేట జ్ఞానజ్యోతి జూనియర్ కళాశాల జట్టు తొమ్మిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. బీ.ఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్. సీతారామారావు విజేతలకు ట్రోఫీలను అందజేశారు. గెలిచిన క్రీడాకారులు జనవరి 9,10,11 తేదీల్లో విజయనగరంలో నిర్వహించే రీజనల్ మ్యాచ్‌లో తలపడతారని శ్రీకాకుళం యూనిట్ మేనేజర్ డీవీ.రమణ తెలిపారు.
ఇదీచూడండి.హోరాహోరీగా 'ఈనాడు' ఆటల పోటీలు