ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు నిర్వహించిన 'ఈనాడు-మీతోడు' ఫోన్ ఇన్ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మేజర్ పంచాయతీ పరిధిలోని సమస్యలు అధికారులకు వివరించేందుకు పంచాయతీ కార్యదర్శి చమళ్ల మధుబాబుతో ఈనాడు ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజలు వివిధ సమస్యలను పంచాయతి పరిధిలోని సమస్యలను అధికారి దృష్టికి తీసుకువచ్చారు. వీధి దీపాలు, అపరిశుభ్రత, కాలువల్లో పూడిక తదితర సమస్యలు తక్షణమే పరిష్కరిస్తామని అధికారులు తెలిపారు. రహదారులు, కాలువల నిర్మాణ సమస్యలను ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లి పరిస్కారానికి కృషి చేస్తానని పంచాయతీ కార్యదర్శి హామీ ఇచ్చారు.
టెక్కలిలో 'ఈనాడు-మీతోడు'కు స్పందన - eenadu_meetodu program
ఈనాడు ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా టెక్కలి మేజర్ పంచాయతీ పరిధిలోని సమస్యలను, అధికారులకు వివరించేందుకు 'ఈనాడు-మీతోడు' ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
'ఈనాడు ఆధ్వర్యంలో టెక్కల్లో 'ఈనాడు-మీతోడు' కార్యక్రమం'