ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీకాకుళం జిల్లాలో ఘనంగా దసరా వేడుకలు - శ్రీకాకుళం జిల్లా దసరా ఈరోజు తాజా వార్తలు

శ్రీకాకుళం జిల్లా దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. జిల్లాలోని పలు ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.

dussara celebrations
దసరా రోజు ఆలయాల్లో భక్తులు పూజలు

By

Published : Oct 25, 2020, 4:47 PM IST

శ్రీకాకుళం జిల్లాలో దసరా ఉత్సవాలు అంగరంగవైభవంగా నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచే అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. దసరా రోజు దుర్గదేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవమైన పాలకొండ కోటదుర్గమ్మ దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. అలాగే జిల్లాలోని వీరఘట్టం కోటదుర్గమ్మ, కోట బొమ్మాళి కొత్తమ్మతల్లి, పాతపట్నం అమ్మవారి ఆలయాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది.

ABOUT THE AUTHOR

...view details