లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించినందుకు చెన్నై నుంచి బోటు ద్వారా శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం తీరప్రాంతాలకు చేరుకున్న 27 మంది మత్స్యకారులపై కవిటి పోలీసులు కేసు నమోదు చేశారు. చెన్నై నుంచి బోటు ద్వారా ఇదివానిపాలెం తీర ప్రాంతానికి శనివారం రాత్రి 12 మంది ఆదివారం వేకువజామున మరో 15 మంది మత్స్యకారులు చేరుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ ఐ కె.వాసు నారాయణ తెలిపారు.
జిల్లాకు చేరిన మత్య్సకారులపై కేసునమోదు - due to violate the lock down rules case field on fishermens
శ్రీకాకుళం చేరిన మత్స్యకారులు లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించారని వారిపై జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే రెండు రోజుల్లో 27మంది మత్స్యకారులు జిల్లాకు చేరారు.
![జిల్లాకు చేరిన మత్య్సకారులపై కేసునమోదు due to violate the lock down rules case field on fishermens](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6861348-959-6861348-1587332694425.jpg)
జిల్లాకు చేరిన మత్య్సకారులపై కేసునమోదు