ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సామాజిక దూరం పాటిస్తూ.. సరుకులు కొనుగోలు చేస్తూ.. - శ్రీకాకుళం జిల్లాలో లాక్​డౌన్​ వార్తలు

లాక్​డౌన్​ కారణంగా శ్రీకాకుళం జిల్లాలో నిత్యావసర సరుకులను.. అధికారులు అందుబాటులో ఉంచారు. నగరంలోని పలు మైదానాల్లో కూరగాయల మార్కెట్లను ఏర్పాటు చేశారు. ప్రజలు సామాజిక దూరం పాటిస్తూ తమకు కావల్సినవి కొనుక్కుంటున్నారు.

due to lockdown Srikakulam district is following the social distance for purchasing vegatables
due to lockdown Srikakulam district is following the social distance for purchasing vegatables

By

Published : Apr 2, 2020, 5:08 PM IST

శ్రీకాకుళం జిల్లాలో నిత్యావసర సరుకులు, కూరగాయలను సామాజిక దూరం పాటిస్తూ కొనుగోలు చేస్తున్నారు. శ్రీకాకుళం నగరంలోని ఆర్ట్స్‌ కళాశాల, ప్రభుత్వ మహిళా కళాశాల, పీఎస్‌ఎన్‌ఎం పాఠశాల, ఎన్టీఆర్‌ నగర పాలక సంస్థ ఉన్నత పాఠశాల మైదానాల్లో కూరగాయలు అందుబాటులో ఉన్నాయి. అలాగే పాత బస్టాండ్‌లోని బజారును 80 అడుగుల రహదారిలో ఏర్పాటు చేశారు. ఉదయం 6 గంటల నుంచి 11 గంట వరకు నిత్యావసరాలకు అనుమతి ఇవ్వడంతో వినియోగదారులు సామాజిక దూరం పాటిస్తూ... తమకు కావల్సిన వస్తువులను కొనుక్కుంటున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details