శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం చేనులవలస ఇసుక ర్యాంపు నుంచి ఇసుక రవాణా చేసే లారీలను బుచ్చిపేట గ్రామస్తులు అడ్డుకున్నారు. ఇసుక రేవు నుంచి లారీలు రాకపోకలు సాగించకుండా రహదారిని నిర్బంధించారు. ఇతర జిల్లాల నుంచి వచ్చిన లారీల రాకపోకలతో తమ గ్రామానికి కరోనా భయం ఉందని.. మూకుమ్మడిగా ఇసుక రేవులో కార్మికులను పనిలో పెట్టడం సరికాదని గ్రామస్తులు ఏకపక్షంగా తేల్చి చెప్పారు. ఈ మేరకు పోలీసులు జోక్యం చేసుకొని గ్రామస్తులతో సంప్రదింపులు జరిపారు. భౌతిక దూరం పాటిస్తూ.. కార్మికులు పనులు చేసుకోవాలని సూచించారు.
ఇసుక రవాణాపై గ్రామస్తుల ఆగ్రహం - ఇసుక రవాణాపై బుచ్చిపేట గ్రామస్తుల ఆగ్రహం
లాక్డౌన్ అమలులో ఉన్నా ఇసుక రవాణా ఎలా చేస్తారంటూ గ్రామస్తులు ఆగ్రహించారు. తమ ఊరి నుంచి రాకపోకలు జరగడానికి వీలు లేదంటూ అడ్డగించారు.
![ఇసుక రవాణాపై గ్రామస్తుల ఆగ్రహం due to lockdown buchipeta Villagers blocking sand tractors at srikakulam district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6738264-556-6738264-1586520599164.jpg)
due to lockdown buchipeta Villagers blocking sand tractors at srikakulam district