ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీకాకుళం మైదానాల్లో రైతుబజార్ల ఏర్పాటు

కరోనా వ్యాప్తి నివారణకు శ్రీకాకుళం జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. నిత్యావసర సరుకుల కొనుగోళ్ల దృష్ట్యా రైతుబజార్లను ఇతర ప్రాంతాలకు తరలించారు. కొనుగోలు సమయాన్ని పెంచారు.

due to corona virus markets are changed to ply grounds at srikakulam
due to corona virus markets are changed to ply grounds at srikakulam

By

Published : Mar 26, 2020, 4:20 PM IST

శ్రీకాకుళంలో రైతుబజార్లను.. మైదానాల్లోకి మార్పు

కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలోని రైతుబజార్లను తాత్కాలికంగా మూసివేశారు. నిత్యావసర సరుకుల విక్రయాలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేశారు. సామాజిక దూరం పాటించాల్సిన అవసరం ఉన్న దృష్ట్యా.. రైతుబజార్లను ఇతర ప్రాంతాల్లోని మైదానాలకు మార్చారు. శ్రీకాకుళం నగరం ఆర్ట్స్‌ కళాశాల, ప్రభుత్వ మహిళ కళాశాల, పీఎస్‌ఎన్‌ఎం పాఠశాల, ఎన్టీఆర్‌ నగర పాలక సంస్థ ఉన్నత పాఠశాల మైదానాల్లో కూరగాయలను అందుబాటులో ఉంచారు. నేటి ఉదయం 6 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిత్యావసరాలకు అనుమతి ఇచ్చారు. వినియోగదారులు సామాజిక దూరం పాటిస్తూ.. కొనుగోలు చేశారు.

ABOUT THE AUTHOR

...view details