ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సమద్రంలో డ్రోన్ కలకలం.. అప్రమత్తమైన అధికారులు - ఏపీలో వైమానిక రక్షణదళ డ్రోన్

Drone found floating in water: సముద్ర తీరప్రాంత మత్స్యకారులకు డ్రోన్ చిక్కింది. సమాచారం తెలుసుకున్న మెరైన్ పోలీసులు ఆ డోన్​ను స్వాధీనం చేసుకున్నారు. డ్రోన్​కు సంబంధించి వివరాల కోసం వైమానిక, రక్షణదళ అధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు.

Drone found floating in water
సమద్రంలో డ్రోన్

By

Published : Feb 2, 2023, 4:02 PM IST

Drone found floating in water in AP: వారంతా చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లారు. వారికి సముద్రంలో దూరంగా వారికి కొత్త వస్తువు కనబడింది. అది గమనించిన మత్య్సకారులు మెుదట దగ్గరకు వెళ్లడానికి భయపడ్డారు. ఆ తరువాత ధైర్యం చేసి దగ్గరకు వెళ్లగా.. అది డ్రోన్​గా గుర్తించారు. వెంటనే సమాచారాన్ని మెరైన్ పోలీసులకు అందించారు. అనంతరం ఆ డ్రోన్​ని ఒడ్డుకు చేర్చారు. మెరైన్ సీఐ ఆ డ్రోన్​ను స్వాధీనం చేసుకున్నారు.

శ్రీకాకుళం జిల్లాలోని సంతబొమ్మాళి మండలం భావనపాడు సముద్ర తీరప్రాంత మత్స్యకారులకు వైమానిక రక్షణ దళ డ్రోన్ చిక్కింది. మూలపేట సమీపంలో సముద్రంలో తేలుతున్న విమానాన్ని పోలి ఉండే ఈ డ్రోన్​ను భావనపాడు జెట్టీకి చేర్చి కోస్టల్ సెక్యూరిటీ పోలీస్టేషన్​కు సమాచారం అందించారు. 9 అడుగుల పొడవు, 111కిలోల బరువున్న ఈ డ్రోన్​పై బన్సీ టార్గెట్ 8081 అని ఆంగ్లంలో ఉండగా.. జనవరి 28, 2023 అని మార్కర్​తో రాసి ఉంది. దీన్ని భావనపాడు కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ స్టేషన్​లో భద్రపరిచారు.

వైమానిక పరిశోధనల్లో భాగంగా టార్గెట్ డ్రోన్​గా ప్రయోగించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. దీని పైభాగంలో ప్యారాచూట్ ఉంది. ప్రయోగ సమయంలో విఫలమై తీరానికి చేరుకుని ఉంటుందని అనుమానిస్తున్నారు. ప్రస్తుతానికి తమకు ఎటువంటి సమాచారం లేదని, స్వదేశానికి చెందిన డ్రోన్​గా ప్రాథమిక నిర్ధరణకు వచ్చామని మెరైన్ సీఐ జి.దేవుళ్లు తెలిపారు. దీనిపై నేవీ, కేంద్ర ఇంటిలిజెన్స్ అధికారులకు సమాచారం అందించామన్నారు.

మత్స్యకారులకు చిక్కిన వైమానిక దళానికి చెందిన డ్రోన్‌

'భావనపాడు దగ్గరలోని సముద్రంలోకి మత్య్సకారులు నిన్న చేపల వేటకు వెళ్లారు. ఈ డ్రోన్​ను వారు సముద్రంలో గమనించారు. దాని గురించి మత్య్సకారులు.. మత్స్యశాఖకు చెందిన అధికారులతో పాటు మాకు సమాచారంఅందించారు. వెంటనే మేము అక్కడికి వెళ్లాము. వారి వద్ద నుంచి ఆ డ్రోన్​ను స్వాధీనం చేసుకున్నాం. ఆ డ్రోన్ ఎక్కడి నుంచి వచ్చిన విషయంలో స్పష్టత లేదు. విదేశాలకు చెందినది కాదనుకుంటున్నాం. నేవీ, రక్షణ అధికారలకు సమాచారం ఇచ్చాం. త్వరలో వారు వచ్చి పరిశీలించిన తరువాత వివరాలు వెల్లడిస్తాం.'-జి.దేవుళ్లు, మెరైన్ సీఐ

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details