ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భౌతిక దూరం మరిచారు.. మద్యం కోసం ఎగబడ్డారు - drinkers queue to liquor shops

ఓ వైపు కరోనా మహమ్మారి విజృంభిస్తున్నా.. మందుబాబులు కొవిడ్ నిబంధనలు మర్చిపోయారు. మద్యం కోసం దుకాణాల ముందు బారులు తీరారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలంలోని చాలా మద్యం దుకాణాల్లో ఇదే పరిస్థితి నెలకొంది.

drinkers set queue for alcohol at ransthalam even in pandemic of corona
భౌతిక దూరం మరిచారు.. మద్యం కోసం ఎగబడ్డారు

By

Published : Aug 9, 2020, 1:40 PM IST

శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలంలోని దుకాణాల వద్ద.. మందుబాబులు బారులు తీరారు. జిల్లాలో వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండటంతో.. ఆయా ప్రాంతాల్లో ఉదయం 6 నుంచి 11గంటల వరకే మద్యం దుకాణాలకు అనుమతులు ఇస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో మద్యం ప్రియులు తెల్లవారుజామునే దుకాణాల వద్దకు చేరుకున్నారు. భౌతిక దూరాన్ని విస్మరించి గుంపులుగా ఎగబడ్డారు. కొందరు మాస్క్ లు ధరించడంలోనూ నిర్లక్ష్యం వహించారు.

పోలీసులు వారిని అదుపుచేయడానికి ప్రయత్నించినా..ఫలితం లేకపోయింది. జనాలు ఇలా గుంపులుగా చేరటం వల్ల వైరస్ వ్యాపించే ప్రమాదముందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.

భౌతిక దూరం మరిచారు.. మద్యం కోసం ఎగబడ్డారు

ఇదీ చదవండి: కొవిడ్ కేర్ సెంటర్లో అగ్నిప్రమాదంపై హోంమంత్రి దిగ్భ్రాంతి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details