శ్రీకాకుళం జిల్లాలో ఆదివారం మద్యం కొనుగోలుకు మందుబాబులు బారులు తీరారు. భౌతిక దూరం, మాస్కు ఉంటేనే మద్యం అమ్మాలని దుకాణదారులను కలెక్టర్ నివాస్ ఆదేశించారు.
ఆ మేరకు విక్రేతలు తగిన ఏర్పాట్లు చేశారు. మద్యం కోసం మందుబాబులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. నిబంధనలు పాటించారు. మాస్కు వేసుకుని.. భౌతిక దూరాన్ని పాటిస్తూ మద్యం కొనుగోలు చేశారు.