రాష్ట్రంలో యువతను.. కన్నీరు పెట్టుకునే పరిస్థితికి ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తీసుకువచ్చారని తెదేపా ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు మండిపడ్డారు. అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం 7 రోడ్లు కూడలిలో తెలుగు యువత ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా.. నిత్యావసర ధరలు పెరిగిపోయిన వైనంపైనా నిరసన వ్యక్తం చేశారు.
పాదయాత్రలో జగన్మోహన్‌రెడ్డి ఉద్యోగాల కోసం ఇచ్చిన హామీ.. ఇప్పుడు ఏమైందని ఎంపీ రామ్మోహన్‌నాయుడు ప్రశ్నించారు. తప్పుడు లెక్కలు రాయడంలో ఆరితేరిన ముఖ్యమంత్రి జగన్.. జాబ్ క్యాలెండర్ రూపకల్పనలోనూ అదే బుద్ధి ప్రదర్శించారని మండిపడ్డారు. వైకాపా సర్కార్ విడుదల చేసిన జాబ్‌లెస్ క్యాలెండర్‌ను వెనక్కి తీసుకొవాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు మద్ధతుగా కలిసికట్టుగా పోరాటం చేస్తామని ఎంపీ హామీ ఇచ్చారు.
'స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం జగన్ పోరాటం చేయాలి'