శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో కరోనా వైరస్ సోకి ఇద్దరు వైద్యులు మృతి చెందారు. పట్టణానికి చెందిన డాక్టర్ మెండ లక్ష్మణరావు కొవిడ్ బారిన పడి జిల్లాలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించి ఈరోజు సాయంత్రం కన్నుమూసినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. మమత నర్సింగ్ హోమ్ వ్యవస్థాపకుడు పొన్నాన సోమేశ్వరరావుకు వైరస్ సోకి.. విశాఖలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న మృతిచెందారు. రెండు రోజుల్లో ఇద్దరు డాక్టర్లు మరణించడం స్థానిక ప్రజలను ఆవేదనకు గురి చేసింది.
కొవిడ్ బారిన పడి ఇద్దరు వైద్యులు మృతి - నరసన్నపేట తాజావార్తలు
కొవిడ్ సోకి ఇద్దరు వైద్యులు మరణించిన ఘటన శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో జరిగింది. పట్టణానికి చెందిన డా.మెండ లక్ష్మణరావు, మమత నర్సింగ్ హోమ్ వ్యవస్థాపకుడు పొన్నాన సోమేశ్వర రావు చికిత్స పొందుతూ మృతి చెందారు.
డా.పొన్నాన సోమేశ్వర రావు