ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దీపావళి.. పండుగే కాదు... ఓ గ్రామం పేరు కూడా..! - news of diwali village in srikakulam

దీపావళి... పండగ కాదు ఓ గ్రామం! అదేంటి అని ఆలోచిస్తున్నారా? దీపావళి అంటే దేశ ప్రజలు అత్యంత ఘనంగా చేసుకునే పండగ కదా.. ఊరంటారేం అనే సందేహం తలెత్తుతోంది కదా. అయితే.. ఇదే మీకు మా సమాధానం. సిక్కోలు జిల్లాలోని దీపావళి గురించి ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.

Diwali village in the Srikakulam district

By

Published : Oct 27, 2019, 10:41 PM IST

Updated : Oct 27, 2019, 11:50 PM IST

శ్రీకాకుళం జిల్లా గార మండలం గొంటి పంచాయతీ పరిధిలో దీపావళి అనే గ్రామం ఉంది. చరిత్ర ఆధారంగా చూస్తే.. దశాబ్దాల కిందట శ్రీకాకుళం ప్రాంతాన్ని పరిపాలించిన రాజు ఆ గ్రామానికి దీపావళి అని పేరు పెట్టినట్లు తెలుస్తోంది. శ్రీకాకుళాన్ని అప్పట్లో సిక్కోలుగా పిలిచేవారు. అప్పటి సిక్కోలు రాజు కళింగపట్నం ప్రాంతానికి గుర్రంపై అప్పుడప్పుడూ ఆ గ్రామం మీదుగా వెళ్లేవారు. ఒక రోజు విహారంలో ఉండగా.. కొబ్బరితోటలోని విష్ణు దేవాలయ సమీపంలో ఎండ తీవ్రతకు స్పృహ తప్పి పడిపోయారట. సమీపంలో వ్యవసాయ పనులు చేసుకుంటున్న కూలీలు రాజు గారిని గుర్తించి సపర్యలు చేశారట. రాజు కోలుకున్న తర్వాత వాళ్లకు కృతజ్ఞతలు తెలిపారట. అదే రోజు దీపావళి పర్వదినం కావడం వల్ల.. ఆ సందర్భానికి గుర్తుగా గ్రామానికి రాజుగారు దీపావళి అని నామకరణం చేసినట్లు చరిత్ర చెబుతోంది. నాటి నుంచి ఆ గ్రామం పేరు దీపావళిగా కొనసాగుతోంది. రెవిన్యూ రికార్డుల్లో కూడా దీపావళిగానే నమోదైంది.

దీపావళి.. పండగే కాదు... ఓ గ్రామం పేరు కూడా..!

300 గృహాల సముదాయం..వెయ్యి మంది జనాభా

శ్రీకాకుళం జిల్లా గార మండలం గొంటి పంచాయతీ పరిధిలోలో ఉన్న దీపావళి గ్రామంలో సుమారు 300 గృహాలతో వెయ్యి మంది జనాభా ఉంటున్నారు. ఈ గ్రామం దీపావళిగా ప్రాచుర్యం పొందటంపై స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. హిందువులకు ఎంతో ముఖ్యమైన దీపావళి పండగ పేరు.. తమ గ్రామానికి పేరు కలిగి ఉండటం సంతోషంగా ఉందంటున్నారు. ఈ గ్రామంలోని మరో విశేషమేంటంటే.. దీపావళి పండగ రోజే పూర్వీకులకు పిండ ప్రదానం చేయటం.

శ్రీకాకుళం జిల్లాలో దీపావళి పేరుతో ఒక్కటే కాదు మరో గ్రామం కూడా ఉంది. ఒకటి గార మండలంలో ఉంటే..మరొక్కటి టెక్కలి మండలం అయ్యోధ్యపురం గ్రామ పంచాయతీ పరిధిలోనూ దీపావళి అనే ఊరు ఉంది.

ఇదీ చదవండి:

ఐఎస్​ అగ్రనేత బాగ్దాదీ హతం.. అమెరికా ప్రకటన

Last Updated : Oct 27, 2019, 11:50 PM IST

ABOUT THE AUTHOR

...view details