Diwali Celebrations in Srikakulam District :దీపాళి పండుగ జరుకోని వారు ఉండరు. చిన్నా పెద్దా తేెడా లేకుండా దీపావళి వేడుగ ఘనంగా జరుపుకుంటారు. కానీ ఈ గ్రామంలో వెలుగునిచ్చే పండుగ చీకట్లు తెచ్చింది అంటున్నారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పున్నానపాలెం గ్రామంలో ఏళ్లతరబడి దీపావళి పండుగను జరుపుకోవటం లేదు. సుమారు 200 ఏళ్ల క్రితం జరిగిన ఓ సంఘటన కారణంగా దీపావళి పండుగకు దూరమయ్యారు. దీపావళి పండుగ రోజున ఉయ్యాలలో నిద్రిస్తున్న చిన్నారి పాము కాటుకు గురై మరణించిందని... అదేరోజు ఊర్లో ఓ రైతుకు చెందిన రెండు ఎద్దులు కూడా మృతి చెందటం వంటి విషాద ఘటనలు గ్రామస్తులను తీవ్రంగా కలించివేశాయి. నాటి నుంచి తమ ఊర్లో దీపావళి పండుగ జరుపుకోవద్దని పెద్దలు తీర్మానించారని స్థానికులు చెబుతున్నారు.ఇంటింటా దీపాల కాంతులు.. అంబరాన్నంటిన సంబరాలు
Diwali Celebrations in Punnanpalem : అదేవిధంగా నాగుల చవితి రోజున మరో విషాద ఘటన చోటు చేసుకోవటంతో ఆ పండుగకు కూడా గ్రామస్తులు దూరమయ్యారు. దీపావళి రోజు పున్నానపాలెంలోని ఏ ఇంట్లో దీపం వెలగదు, ఒక టపాసు కూడా పేలదు. ఎవరైనా మొండితనంతో పండగ జరుపుకుంటే వారింట్లో ఆశుభం జరుగుతుందని వారి నమ్మకం. గ్రామంలో చదువుకున్నవాళ్లు ఉన్నప్పటికీ....వారంతా గ్రామ పెద్దలు నిర్ణయించిన కట్టుబాటు గౌరవిస్తూ ఆచారాన్ని పాటిస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా దీపావళి సంబరాలు..
'నేను ఒక ఉపాధ్యాయుడ్ని.. దీపావళి జరుపుకోవాలని ఊరి పెద్దలతో, గ్రామస్తులతో మాట్లాడాను. కానీ ఫలితం లేకపోయింది... మొండి వైఖరితో మేము వేడుకలు చేసుకున్నాం. యాధృచ్ఛికమో,దురదుష్టమో తెలియదు మా కొడుకు కూడా చనిపోయాడు. పెద్దలు నన్ను మందలించారు. ఇక అప్పటి నుంచి మేమూ పండుగకు దూరంగానే ఉంటున్నాం.