క్రీడలతో మానసిక ఉల్లాసం.. ఉత్తేజంతో పాటు ఆరోగ్యం.. లభిస్తుందని జిల్లా విద్యాశాఖాధికారి చంద్రకళ పేర్కొన్నారు. శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల మైదానంలో సర్వశిక్షా అభియాన్ నేతృత్వంలో జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో దివ్యాంగుల జిల్లా స్థాయి క్రీడా పోటీలు జరిగాయి. ఈ కార్యక్రమానికి జేసీ శ్రీరాములుతో పాటు డీఈవో చంద్రకళ పాల్గొన్నారు.
అందరిలాగే ప్రత్యేక అవసరాల పిల్లలు.. ఎందులోనూ తక్కువ కాదనే భావనతో క్రీడల పోటీలను నిర్వహించడం జరుగుతుందన్నారు. క్రీడాకారులను.. క్రీడలకు తీర్చిదిద్దిన శిక్షకులను జేసీ, డీఈవో అభినందించారు. జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర, జాతీయస్థాయి పోటీలకు ఏదగాలని ఆకాంక్షించారు.