శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. అంబేడ్కర్ రాజగృహపై దాడిని తీవ్రంగా ఖండించారు. చారిత్రక విలువలు ఉన్న కట్టడాలపైనే దాడి జరిగితే సామాన్య ప్రజానీకానికి రక్షణ ఎక్కడిది అని ప్రశ్నించారు.
'అంబేడ్కర్ రాజగృహపై దాడి హేయమైనది' - attack on ambedkar library
డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ నివాసం ఉన్న రాజగృహ (లైబ్రరీ)పై గుర్తు తెలియని దుండగుల దాడి హేయమైనదని శ్రీకాకుళం జిల్లా కాంగ్రెస్ కమిటీ మండిపడింది.
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని జిల్లా కలెక్టర్ ద్వారా భారత రాష్ట్రపతికి మెమోరాండం ఇచ్చిన్నట్లు మాజీ ఎమ్మెల్యే, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు బొడ్డేపల్లి సత్యవతి తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సెల్ కన్వీనర్ సనపల అన్నాజీరావు, బొడ్డేపల్లి గోవింద్ గోపాల్, లఖినేని నారాయణ రావు, బొత్స రమణ, బసవ షణ్ముఖరావు, కూన సుందరరావు, లఖినేని సాయిరాం, పైడి శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండితల్లి కడుపులోనే బిడ్డ మృతి.. నిర్లక్ష్యం.. పేదరికమే కారణం!