2021-22 సంవత్సరంలో రైతు భరోసా పథకం కింద మొదటి విడతగా శ్రీకాకుళం జిల్లాలో 3 లక్షల 90 వేల 988 మంది రైతుల ఖాతాల్లో 293 కోట్ల రూపాయలు జమ కానున్నాయని కలెక్టర్ జె.నివాస్ తెలిపారు. వైఎస్సార్ రైతు భరోసా కింద రూ. 216.87 పీఎం కిసాన్ పథకం కింద మరో రూ 76.37 కోట్లు జిల్లా రైతుల ఖాతాల్లో పడనున్నాయని వివరించారు. రైతు భరోసా కార్యక్రమం సందర్భంగా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడారు.
గడచిన 2 సంవత్సరాల్లో జిల్లాలో 2019-20 సంవత్సరములో 3.34 లక్షల మంది రైతులకు రూ. 450.98 కోట్లు, 2020 - 21 సంవత్సరంలో 3.81 లక్షల రైతు కుటుంబాలకు రూ.509 కోట్లు ఆర్ధిక సహాయం అందించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ హాజరయ్యారు. ప్రభుత్వం సరైన సమయంలో రైతులకు ఆర్ధిక సహాయం అందిస్తోందన్నారు. వ్యవసాయం దండగ అనే దగ్గరి నుంచి వ్యవసాయం పండగ అనేలా ఈ ప్రభుత్వం పాలిస్తోందని చెప్పారు.