శ్రీకాకుళం హిరమండలం మండలం చిన్న కోరాడకు చెందిన పల్లి గడ్డెన్నాయుడు(81) అనే వృద్ధుడికి నాలుగో అదనపు సెషన్స్ కోర్టు జీవిత ఖైదు విధించింది. కుటుంబ కలహాల కారణంగా అతను.. తన భార్యను హత్య చేశాడు. 2013లో జరిగిన ఈ ఘటనపై విచారించిన న్యాయస్థానం శిక్షను ఖరారు చేసింది.
వృద్ధునికి జీవిత ఖైదు విధించిన జిల్లా అదనపు సెషన్స్ కోర్టు - srikakulam district Additional Sessions Court latest news
భార్యను చంపిన కేసులో భర్తకు జీవిత ఖైదు విధించింది న్యాయస్థానం. శిక్షపడింది 81 సంవత్సరాలున్న వృద్ధుడికి. శ్రీకాకుళం జిల్లా నాలుగో అదనపు సెషన్స్ కోర్టు ఈ తీర్పు వెలువరించింది.
జీవిత ఖైదు శిక్షపడిన వృద్ధుడు
గడ్డెన్నాయుడు.. హిరమండలం గార్లపాడు నిర్వాసిత గ్రామంలో ఉండేవాడు. అనంతరం హిరమండలం మేజర్ పంచాయతీ పరిధిలోని చిన్న కోరాడకు మారారు. కుటుంబ కలహాల కారణంగా భార్యను హత్య చేశాడు. ప్రస్తుతం సుబలయి గ్రామంలో నివాసం ఉంటున్నాడు. నేరపూరిత చరిత్ర ఉన్నవాడు కావటంతో కుటుంబ సభ్యులు అతనికి దూరంగా ఉంటున్నారు.
ఇదీ చదవండి:అప్పుల బాధతో ఓకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్యాయత్నం!