శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండల పరిధిలోని రెడ్‌జోన్ గ్రామాల్లో ప్రజలకు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో కూరగాయలు, పండ్లు పంపిణీ చేశారు. రెడ్‌జోన్ పరిధిలోని 18 గ్రామాలకు ప్రభుత్వం ఈ సదుపాయాన్ని కల్పించిందని రెవెన్యూ, వ్యవసాయ మార్కెట్ శాఖ అధికారులు తెలిపారు. ఇరు శాఖల సమన్వయంతో ఆయా గ్రామాలకు సరుకులు పంపిణీ చేస్తున్నామని అన్నారు. స్థానిక ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు కూరగాయలు అందిస్తున్నట్లు తెలిపారు.
రెడ్‌జోన్ గ్రామాల్లో కూరగాయలు, పండ్లు పంపిణీ
శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలోని రెడ్‌జోన్ గ్రామాల్లో వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో కూరగాయలు, పండ్లు పంపిణీ చేశారు. దాదాపు 18 గ్రామాలకు ప్రభుత్వం ఈ సదుపాయం కల్పించిందని అధికారులు తెలిపారు.
వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో కూరగాయలు,పళ్ళు పంపిణీ