శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలంలో 18 గ్రామాలను రెడ్ జోన్ గా అధికారులు గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తున్నారు. ప్రజలను ఇళ్లకే పరిమితం చేస్తూ... కూరగాయల పంపిణీ వేగవంతం చేశారు.
ముందుజాగ్రత్తగా ప్రజలు అధిక సంఖ్యలో కొనుగోలు చేయటం వల్ల కొన్ని గ్రామాల ప్రజలకు 2 రోజులుగా కూరగాయల అందలేదు. అందుకే మంగళవారం ఒక్క రోజే సుమారు 20 టన్నుల కూరగాయలు పంపిణీకి సిద్ధం చేశారు. అన్ని ప్రాంతాల ప్రజలకు కూరగాయలు అందుతాయని అధికారులు భరోసా ఇస్తున్నారు.