శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస తహసీల్దార్ కార్యాలయంలో పేదలకు లాటరీ పద్ధతిలో పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. శాసనసభాపతి తమ్మినేని సీతారాం పాల్గొన్నారు. రాష్ట్రంలో మొత్తం 27 లక్షల మంది ఇల్లులేని అర్హులైన పేదలకు ఇళ్ల పట్టాల మంజూరుకు ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఆయన తెలిపారు.
ఆమదాలవలస పురపాలక సంఘంలోని ఆర్ ఆర్ కాలనీ, తిమ్మాపురం గ్రామ ప్రాంతాల్లో పేదలకు 2400 ఇళ్లకుగాను అర్హులకు లాటరీ పద్ధతిలో ఇళ్ల స్థలాలు మంజూరు చేశారు. గత సంవత్సరం ఇదే రోజు వైకాపాకు తిరుగులేని విజయాన్ని అందించారని సభాపతి గుర్తు చేసుకున్నారు.